Bhadrachalam: జగదీష్ కాలనీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ!

Bhadrachalam: భద్రాచలం జగదీష్ కాలనీ పాఠశాలను ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలు, పరిశుభ్రతపై ప్రశంసలు కురిపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 3:30 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: జగదీష్ కాలనీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ!

Bhadrachalam: భద్రాచలం శివారులో బలహీన బడుగు వర్గాల పిల్లల అభ్యున్నతి కొరకు కారు చీకట్లో కాంతి పుంజములా జగదీష్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల నిరంతరం కృషి చేస్తుందని మండల విద్యాశాఖాధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.పాఠశాల పర్యవేక్షణలో భాగంగా గురువారం నాడు మండల విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా పాఠశాల సందర్శించారు.పాఠశాల సమయానికి కంటే ముందు పాఠశాల ఆవరణంలో చేరుకున్న మండల విద్యాశాఖ అధికారి అక్కడున్న విద్యార్థులతో సుమారు 15 నిమిషాలు ముఖాముఖి నిర్వహించి వారిలోని అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.

అదేవిధంగా పాఠశాలలో పరిశుభ్రత పచ్చదనాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థుల మరుగుదొడ్లను సైతం తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచి పాఠశాల స్వచ్ఛ మిత్ర సేవకురాలు యొక్క కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పాఠశాల విద్యార్థుల క్రమశిక్షణ చూసి ఉపాధ్యాయుల నిరంతర కృషికి అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో కొన్ని సూచనలు చేస్తూ మధ్యాహ్న భోజన శాల ముందు ఎం డి ఎం లోగోను మెనూ రంగులతో రాయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచన చేశారు.పాఠశాల బోర్డులను చూసి ఆ వార్డుకే అందం తెచ్చే విధంగా దారిన వెళ్లే చూపర్ల ను సైతం ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయ కృషికి అభినందనలు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య పునాది అయినటువంటి ఎఫ్.ఎల్. ఎన్ సామర్ధ్యాల సాధనపై నిరంతరం కృషి చేయాలని ఉపాధ్యాయు లను ప్రత్యేకంగా కోరారు.

అలాగే పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.పాఠశాలలో పాఠశాల కాల నిర్ణయ పట్టికలో ఆటలకు,సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం కల్పించి పిల్లల్లోని అంతర్గత సామర్థ్యాలను అభివృద్ధి దిశగా పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

పాఠశాలకు ప్రత్యేక నిర్వహించే స్వచ్ఛ విద్యాలయ పురస్కార విభాగంలో అన్ని అంశాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో అవార్డు కైవసం చేసుకోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రార్థన కంటే 25 నిమిషాలు ముందుగా హాజరైన ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు.

పాఠశాల పర్యవేక్షణ అనంతరం ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి తరగతి గదిలో కచ్చితంగా పాటించాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో కలిసి మండల విద్యాశాఖ అధికారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్, ఉపాధ్యాయులు రమాదేవి, విజయ, నాగమణి, సైదులు, ఆశలత, మాధవి స్వచ్ఛమిత్ర, మధ్యాహ్న భోజన ఏజెన్సీ రాజేశ్వరి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story