Bhadrachalam: భద్రాచలం గోదావరి స్నానఘట్టాల వద్ద అధికారుల నిర్లక్ష్యం!
Bhadrachalam: భద్రాచలంలో గోదావరి తగ్గినప్పటికీ స్నానఘట్టాల వద్ద పేరుకుపోయిన అడుగు లోతు బురద, చెత్త దుర్వాసనతో రామయ్య భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Bhadrachalam: భద్రాచలం గోదావరి స్నానఘట్టాల వద్ద అధికారుల నిర్లక్ష్యం!
Bhadrachalam: భద్రాచలం ఆగస్టు 18 -పవిత్ర గోదావరి నదీ తీరం దుర్వాసనతో భక్తులను ఇబ్బందులు పెట్టే విధంగా మారింది భద్రాది అంటేనే అంతా రామమయం అంటారు కానీ ఇక్కడ చూస్తే అంతా బురదమయంగా ఉంది.
సాయం సంధ్య వేళ గోదావరి నదిలో బోటింగ్ లో విహారయాత్ర చేయాలన్న ఆ బురదలోంచి వెళ్లాల్సిందే. గోదావరి తగ్గి ఇన్ని రోజులైనా గ్రామపంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు అని భక్తుల ఆందోళన.దక్షిణ భారతదేశంలోని రెండవ అయోధ్యగా పెరిగాంచింది భద్రాచల శ్రీరామ పుణ్యక్షేత్రం.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సీతారామచంద్రస్వామి దివ్యమూర్తులను దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆలయానికి వెళ్లే ముందు తెల్లవారుజామున పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించి రామయ్య ని దర్శించుకుంటారు కానీ గోదావలో స్నానానికి వెళ్లే భక్తులు తెల్లవారుజామున చీకట్లోనే అడుగు లోతు బురదలోంచి వెళ్లి పుణ్య స్థానాలు చేస్తున్నారు.
అంతేకాకుండా గోదావరి తగ్గి రెండు వారాలు అవుతున్న సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు తాత్కాలికంగా క్లీన్ చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ఈ చెత్త దుర్వాసనతో భద్రాచలానికి వచ్చినందుకు పుణ్యమేమోగాని కొత్త రోగాలు వస్తాయని భయంతో భక్తులు గోదావరి స్నానానికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు.
మరికొందరు తప్పదని బురదలోంచి వెళ్లి స్థానాలు చేస్తున్నారు. దీంతో నిత్యం గోదావరి స్నాన ఘట్టాల వద్ద భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుషంగా ఉంది..
గోదావరిలో బోటింగ్ చేయాలని చాలామంది యాత్రికులకు ఉత్సహం ఉంటుంది.బోటులో ప్రయాణిస్తూ గోదావరి అందాలను సెల్ఫీలతో తమ మొబైల్ లో బంధించుకునే వారు కూడా చాలా మంది ఉంటారు బురద ఎక్కువ ఉండడంతో యాత్రికులు ఎవరు కూడా రావట్లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ ప్రాంతం అంతా క్లీన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.




