Bhadrachalam: నెహ్రూ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Bhadrachalam: భద్రాచలం నెహ్రూ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 35 కిలోల నాసిరకం లాలీపాప్‌లు, స్వీట్లను స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 7:35 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: నెహ్రూ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా. చిన్నపిల్లల తినే చిరుతిండ్లకు సంబంధించి అనేక దుకాణాలు వెలిశాయి. చాలా దుకాణాల్లో నాణ్యతలేని నాసిరకమైన పిల్లలు తినే చిరుతిండ్లను విక్రయిస్తున్నారు.

దీంతో కొందరు చేసిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని నెహ్రూ మార్కెట్లో సుమారు 15 దుకాణాలను తనిఖీలు చేసిన అధికారులు క్వాలిటీ లేని నాసిరకమైన ఎలాంటి లైసెన్సులు లేని పిల్లలు తినే చిరుతిన్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

వాటన్నింటినీ శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపించనున్నట్లు తెలిపారు. మరోవైపు అనేక దుకాణాలకు లైసెన్సులు లేకపోవడంతో ఆహారానికి సంబంధించి వస్తువులను అమ్మే అన్ని దుకాణాలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు.

చిరుతిండ్ల దుకాణాలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను స్వీట్ షాపులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ మాట్లాడుతూ ఆహార భద్రతకు సంబంధించి లేబుల్ లేకుండా భద్రాచలంలో అనేక దుకాణా దారులు ఇలాంటి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని తెలిపారు. వీటన్నిటిని శాంపిల్స్ పంపించడం జరుగుతుందని అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలంతా తినే పదార్థాల పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story