Bhadrachalam: భద్రాచలం డిగ్రీ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమల తయారీ, పంపిణీ
Bhadrachalam: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమల తయారీ. పండుగ రోజు ప్రజలకు ఉచితంగా మట్టి బొమ్మల పంపిణీ చేయనున్నట్లు వెల్లడి.
Bhadrachalam: భద్రాచలం డిగ్రీ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమల తయారీ, పంపిణీ
భద్రాచలం: రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భద్రాచలం పట్టణ ప్రజలకు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను ఉచితముగా పంపిణీ చేయడానికి విద్యార్థిని విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయడం జరిగిందని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అన్నారు.
ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వినాయక చవితిని పురస్కరించుకొని ఎకో క్లబ్, ఎన్ఎస్ఎస్ మరియు కల్చరల్ విభాగం సంయుక్తంగా కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందితో కలిసి వినాయక మట్టి బొమ్మలను తయారు చేయడం జరిగిందని ఆయన అన్నారు.మట్టి వినాయకుని వాడటం వల్ల నీటి కాలుష్యం అనేది
ఏర్పడదని ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. తయారుచేసిన వినాయక మట్టి బొమ్మలను భద్రాచలంలోని ప్రజలకు వినాయక చవితి పండుగ నాడు ఉచితముగా విద్యార్థిని విద్యార్థులు పంపిణీ చేస్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కపిల భారతి, ఎకో క్లబ్ కోఆర్డినేటర్ బి సుధాకర్ రావు, ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




