Bhadrachalam: భర్త ప్రేమ కోసం భార్య పోరాటం: భద్రాచలంలో ధర్నా!
Bhadrachalam: భద్రాచలంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి కోటయ్య భార్య, కూతురు మహిళా సంఘాలతో కలిసి షాపు ఎదుట ధర్నా చేశారు. న్యాయం చేయాలని వేడుకోగా, నిందితుడు పరారయ్యాడు.
Bhadrachalam: భర్త ప్రేమ కోసం భార్య పోరాటం: భద్రాచలంలో ధర్నా!
భర్త కోసం భార్య పోరాటం తండ్రి ప్రేమ కోసం కూతురు ఆవేదన బాలదుర్గ బట్టల షాప్ ఎదుట మహిళా సంఘాల ఆధ్వర్యంలో తల్లి కూతుర్ల ధర్నా
భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపార దుకాణం ముందు తమకు న్యాయం చేయాలంటూ భార్యా పిల్లలు ఆందోళనకు దిగారు..భర్త బొప్పే కోటయ్య గత కొంతకాలంగా వేరే మహిళలతో సంబంధాలు ఏర్పరచుకొని సహజీవనం చేస్తూ తనకు విడాకులు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నాడని కోటయ్య భార్య,కూతురు ఆరోపిస్తున్నారు.....
పట్టణంలోని వస్త్ర ప్రముఖ వ్యాపార సంస్థ బాలదుర్గ టాపిన్ టౌన్ పేరుతో నడుస్తున్న ప్రముఖ వస్త్ర దుకాణంలో కోటయ్య వాటాదారుడుగా కొనసాగుతున్నాడని,కొద్ది సంవత్సరాలుగా కోటయ్య కుటుంబ సభ్యులు మరియు తమను బంధువులు తీవ్రంగా వేధింపులకు గురి గురి చేస్తున్నారంటూ ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో బాలదుర్గ టాప్ ఇన్ టౌన్ వస్త్ర దుకాణం ముందు వారు ఆందోళన చేపట్టి ధర్నాకు దిగారు..అనంతరం మహిళా సంఘాల సహకారంతో వారు పోలీసులను ఆశ్రయించారు... ప్రస్తుతం ఈ ఘటనతో కోటయ్య పరారీలో ఉఉన్నాడని,కోడలినైన తనపై మనవరాలైన తన కూతురిపై కూడా కోటయ్య తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడే వాడని, తన భర్త కోటయ్య తోనే కలిసి ఉంటామన్న విజయలక్ష్మి అతని కుటుంబ సభ్యుల వేధింపుల నుండి విముక్తి కల్పించి తమకు సరైన న్యాయం చేయాలని కోటయ్య భార్య భార్య విజయలక్ష్మి,కూతురు వెన్నెల వేడుకుంటున్నారు....




