Bhadrachalam: భద్రాచలంలో 1000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ: బార్ అసోసియేషన్

Bhadrachalam: భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివరాం నాయక్ చేతుల మీదుగా 1000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 13 Sept 2026 8:39 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో 1000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ: బార్ అసోసియేషన్

భద్రాచలం: భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పీవి కృష్ణమాచారి హైకోర్టు అడ్వకేట్ సహకారంతో ఉచిత గణపతి మట్టి ప్రతిమలపంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం జ్యుడీషియన్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ శ్రీ శివరాం నాయక్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహాలను పంచిపెట్టారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ ఈ మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా ఎటువంటి కాలుష్యం ఉండకపోవడమే కాకుండా కాకుండా పవిత్ర గోదావరి నదిలో ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో కూడిన రసాయనాలతో తయారైన పర్యావరణానికి నీటికి జరిగే కాలుష్యాన్ని నివారించవచ్చని బార్ అసోసియేషన్ వారు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem