Ashwaraopeta: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజు 5 ప్రసవాలు!

Ashwaraopeta: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజు 5 ప్రసవాలు పూర్తి చేసిన వైద్యులు తల్లులు శిశువులు క్షేమమని తెలిపిన సూపరింటెండెంట్.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 4 Sept 2026 3:17 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజు 5 ప్రసవాలు!

Ashwaraopeta: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఒకే రోజులో నాలుగు సాధారణ ప్రసవాలు, ఒక సిజేరియన్‌ ప్రసవం విజయవంతంగా నిర్వహించి తల్లులు, శిశువులను క్షేమంగా ఉంచారు.

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్న గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధా రుక్మిణి తెలిపారు.

ఒకే రోజు ఐదుగురు మహిళలకు ప్రసవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లులు, శిశువులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని సూపరింటెండెంట్‌ వెల్లడించారు.

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపడటానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, డీసీహెచ్‌ఎస్‌ రవి బాబు అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని డాక్టర్‌ రాధా రుక్మిణి తెలిపారు. వారి సహకారంతోనే ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.

మరోవైపు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు, వారి బంధువులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు ప్రసవ సేవలు మెరుగ్గా అందుతున్నాయని వారు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా.. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలకు ఈ విజయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA

Next Story