Ashwapuram: మిట్టగూడెం కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
Ashwapuram: అశ్వాపురం మండలం మిట్టగూడెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించిన సీఐ ఎల్లయ్య. 1930 టోల్ ఫ్రీ నంబర్ సద్వినియోగానికి పిలుపు.
Ashwapuram: మిట్టగూడెం కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు అశ్వాపురం సీఐ సీహెచ్. ఎల్లయ్య పాల్గొని సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ci గారు మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా విద్యార్థులు సోషల్ మీడియా, ఆన్లైన్ యాప్స్ వినియోగించే సమయంలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఆన్లైన్లో బహుమతులు, ఉద్యోగాలు, రుణాలు, పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించే అవకాశముందని, ఇటువంటి విషయాల్లో అత్యాశకు పోకుండా ముందుగా పూర్తి వివరాలు పరిశీలించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సైబర్ భద్రతపై పలు విషయాలను తెలుసుకున్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించడం ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు.




