Kothagudem: జిల్లా కాంగ్రెస్ ఓబీసీ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ!
Kothagudem: కాంగ్రెస్ నూతన ఓబీసీ కమిటీ ఏర్పాటు కోసం ఆసక్తిగల నాయకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీపీసీసీ ఓబీసీ జిల్లా అబ్జర్వర్లు ప్రకటించారు.
Kothagudem: జిల్లా కాంగ్రెస్ ఓబీసీ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ!
కొత్తగూడెం, ఆగస్టు 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నూతన ఓబీసీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు టీపీసీసీ ఓబీసీ జిల్లా అబ్జర్వర్లు తెలిపారు. టీపీసీసీ ఓబీసీ చైర్మన్ ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ కమిటీ ఏర్పాటులో భాగంగా జిల్లాలోని వివిధ మండలాలు, డివిజన్లు, పట్టణాలు, నియోజకవర్గ స్థాయిల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జిల్లా కమిటీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ప్రసన్న దేవిని టీపీసీసీ ఓబీసీ జిల్లా అబ్జర్వర్లు కలిసి కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్జర్వర్ అనిల్ కుమార్, పిండ్రాల రాందాసు, డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తీక్, డీసీసీ జిల్లా కమిటీ సభ్యులు పెద్దబాబు, చింతలపుడి రాజశేఖర్, జానీ పాషా, నాగార్జున తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




