Kothagudem: పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన కలెక్టర్ అంకిత్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇందిరా నగర్ కాలనీ పీహెచ్‌సీలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ డాక్టర్ తుకారం

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Updated on: 28 Jun 2026 4:55 PM IST
Kothagudem
X

Kothagudem: పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన కలెక్టర్ అంకిత్!

భద్రాద్రి: ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాల్వంచ మండలం ఇందిరా నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు..

జిల్లాలో ప్రతి ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రయాణాలు ఉన్న కుటుంబాలు బస్టాండ్లు రైల్వేస్టేషన్లలో ఏర్పాటుచేసిన పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇటుక బట్టీలు వ్యవసాయ పనులు నిర్మాణ ప్రదేశాలు ఇతర పని ప్రదేశాల్లో ఉన్న చిన్నారులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్ళి ఆరోగ్య సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలోజిల్లా కేంద్రంలోనిబస్ స్టాండ్ ఆవరణలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ తుకారం రాథోడ్ పరిశీలించారు.

కూరగాయల వారపు సంతలో, ప్రయాణికుల వద్దకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ స్వయంగా వెళ్లి దగ్గరుండి పోలియో చుక్కలను వేయించినందుకు హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు..ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మీడియాతో మాట్లాడుతూజిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం మొదలైందన్నారు.మొత్తం 98,818 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం టార్గెట్ అన్నారు.

దీనిలో భాగంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ తుకారం రాథోడ్ స్వయంగా పాల్గోని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.అనంతరం డి ఎం హెచ్ వో సామజిక బాధ్యతగా బస్ స్టాండ్ ఆవరణలో కలియ తిరుగుతూ బస్సుల్లో ప్రయాణిస్తున్న 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, ప్యాసింజర్లకు అవగాహన కల్పిస్తూ, దగ్గరుండి చంటి పిల్లల తల్లి -తండ్రులను అవగాహన కల్పిచారు.దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేసారు.

అక్కడనుండి DM&HO వారాంతపు కూరగాయల సంత వద్దకు సైతం వెళ్లి అక్కడ జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారి పిల్లలను గుర్తించి దగ్గరుండి పోలియో చుక్కలను వేయించారుర.ఒక జిల్లా అధికారిగా వుంటూ బస్ స్టాండ్ ఆవరణలో, కూరగాయల సంతకు వచ్చిన వారికి సైతం పల్స్ పోలియోపై అవగాహన కల్పించడం పట్ల డి ఎం హెచ్ వో రాథోడ్ బాధ్యత పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు...ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లో, పట్టణాల్లో ముఖ్య ప్రదేశాలతో పాటు అన్ని PHC,UPHC, పోలియో కేంద్రాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు.

దేశంలో పోలియో రక్కసిని పూర్తిగా నిర్ములించే కార్యక్రమంలో భాగంగా పోలియో రహిత దేశంగా ఉండాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం మేరకు ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమానికి తల్లిదండ్రులు సహకరించి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

గత 15 సంవత్సరాలు పైగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ఇతర దేశాల్లో నమోదు అవుతుండడంతో అది మనకు రాకుండా ఉంచేందుకు మన దగ్గర పకడ్బందీగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తూన్నామన్నారు.జిల్లావ్యాప్తంగా 925 సెంటర్లలో ,38 ట్రాన్సిట్ పాయింట్లు , 1001టీములు ఏర్పాటు చేయడం జరిగిందని DM&HO డా. తుకారాం రాథోడ్ వివరించారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయడం, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డా. తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పల్స్ పోలియో బ్యానర్ ను ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో Dr రాకేష్ ప్రోగ్రాం అధికారి, Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, సిహెచ్ఓ నాగభూషణం హెచ్ ఇ వో రాంప్రసాద్, రామారావు, హరికృష్ణ , ప్రియా నర్సింగ్ ఆఫీసర్, పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story