Kothagudem: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సంక్షేమం శ్రీనివాస్ రెడ్డి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మాట్లాడిన వై. శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమన్నారు.
Kothagudem: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సంక్షేమం శ్రీనివాస్ రెడ్డి!
Kothagudem: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు.
మహిళల కోసం మహాలక్ష్మి, గృహజ్యోతి, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, విద్యా రంగంలో సంస్కరణలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, యువతకు ఉద్యోగాలు, వైద్య రంగ విస్తరణ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రాబోయే రెండేళ్లలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




