Kothagudem: ఐలు కొత్తగూడెం జిల్లా కోర్టు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Kothagudem: కొత్తగూడెం ఐలు జిల్లా కోర్టు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. గౌరవ అధ్యక్షుడిగా పుల్లయ్య, అధ్యక్షుడిగా రావిలాల రామారావు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 Sept 2026 7:33 PM IST
Kothagudem
X

Kothagudem: ఐలు కొత్తగూడెం జిల్లా కోర్టు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Kothagudem: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) కొత్తగూడెం జిల్లా కోర్టు కమిటీ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా కటకం పుల్లయ్య, అధ్యక్షుడిగా రావిలాల రామారావు, ప్రధాన కార్యదర్శిగా కిలారు పురుషోత్తం రావు, కోశాధికారిగా దూళిపాల రవికుమార్ ఎన్నికయ్యారు.

ఈ సమావేశానికి ఐలు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంతో పాటు న్యాయవ్యవస్థలో ప్రజలకు న్యాయం అందేలా న్యాయవాదులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సమావేశంలో పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story