Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా ఆదార్ పార్టీ నియోజకవర్గ సమావేశం!
Kothagudem: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఆదార్ పార్టీ ముందుకు సాగుతోందని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఈడ శేషగిరిరావు తెలిపారు.
Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా ఆదార్ పార్టీ నియోజకవర్గ సమావేశం!
Kothagudem: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈడ శేషగిరిరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలో ఆదార్ పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
కొత్తగూడెం అసెంబ్లీ ఇంచార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్, జిల్లా అధ్యక్షులు కంటే కేశవ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి డాక్టర్ ఈడ శేషగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే ఆసక్తి, సామర్థ్యం ఉన్న యువతీ యువకులకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజీ బుడ్డయ్య, రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తగరం ఆకులయ్య, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు గౌడ్, హైదరాబాద్–మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇంచార్జ్, ఖమ్మం పట్టణ నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు తల్లాడ వెంకన్న, శ్రీనివాసులు, మంగపతి యాదవ్, దుర్గప్రసాద్ గౌడ్, అంబోజు రవి, అలెం రమ, కెలోత లక్ష్మీ, మరియా, పద్మ తదితరులు హాజరయ్యారు.




