Khammam: ఖమ్మంలో నేటి నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు: సీపీఐ!
Khammam: ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఈ నెల 16 వరకు సీపీఐ ఆధ్వర్యంలో 78వ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు.
Khammam: ఖమ్మంలో నేటి నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు: సీపీఐ!
ఖమ్మం: 78వ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లాలో -నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సభలు, -సమావేశాలు నిర్వహించనున్నట్లు సురేష్ తెలిపారు. ఈనెల 11న ఉదయం నల్లమల గిరిప్రసాద్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
12న చింతకాని మండలం ప్రొద్దుటూరు, బోనకల్ మండలం గోవిందాపురం గ్రామాల్లో సాయుధ పోరాట వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 13న ఎం. వెంకటాయపాలెం, గోకినేపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో, 15న రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో, 16న తనికెళ్ల, ఏన్కూరు మండలం మేడేపల్లి, సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామాల్లో సాయుధ పోరాట వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని సురేష్ తెలిపారు. 17న సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సురేష్ తెలిపారు.




