Kothagudem: సివిల్ సర్వీసెస్ క్రీడలు: రాష్ట్ర స్థాయికి 40 మంది ఎంపిక!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికల్లో 40 మంది ఉద్యోగులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీవైఎస్ఓ పరంధామ రెడ్డి తెలిపారు.
Kothagudem: సివిల్ సర్వీసెస్ క్రీడలు: రాష్ట్ర స్థాయికి 40 మంది ఎంపిక!
కొత్తగూడెం, సెప్టెంబర్ 3: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2025-26 కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి తెలిపారు.
పాల్వంచలోని మినీ స్టేడియం, విద్యుత్ కళాభారతి, కేటీపీఎస్ వేదికలుగా ఈ పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 80 మంది ఉద్యోగులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు.
పలు క్రీడాంశాల్లో పోటీలు మినీ స్టేడియంలో అథ్లెటిక్స్ (పురుషులు/మహిళలు), చెస్, క్యారమ్స్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా, కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, ఖోఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. విద్యుత్ కళాభారతి, కేటీపీఎస్‌లో క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు జరిగాయి.
రాష్ట్ర స్థాయి పోటీలకు 40 మంది ఎంపిక..
జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన 40 మంది ఉద్యోగులను సెప్టెంబర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున పంపించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి వెల్లడించారు.




