Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగాయూత్ కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవం

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నేషనల్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 9 Aug 2026 12:26 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగాయూత్ కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవం

పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నేషనల్ యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సమకూడిన నాయకులు, శ్రేణులు టపాసులు పేల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.

​ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ మాట్లాడుతూ... తన పనితీరును గుర్తించి రెండోసారి మండల యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, యువత సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానికంగా ఎదురయ్యే ప్రజాసమస్యలతో పాటు యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలపై ఎమ్మెల్యే విజయరమణారావు ఎల్లప్పుడూ సరైన మార్గదర్శకత్వం వహిస్తూ, ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.

​కాంగ్రెస్ పార్టీలో యువతకు సముచిత స్థానం లభిస్తుందని, పీసీసీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేకమంది యూత్ కాంగ్రెస్ నాయకులకు వార్డు మెంబర్లుగా, ఉపసర్పంచులుగా అవకాశాలు కల్పించినందుకు ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మార్కెట్ డైరెక్టర్ ఎనిగంటి రవి, తాండ్ర గోవర్ధన్, తాండ్ర శివ, సుమన్ యాదవ్, జీల అజయ్, ఆమిడాల స్వామి, రేండ్ల నాగేష్, శ్రీధర్ రెడ్డి, మద్దుల నరేష్, వోడ్నాల అజయ్, తదితరులు పాల్గొన్నారు

యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story