Karimnagar: కరీంనగర్‌లో రాజీవ్ చౌక్ వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం!

Karimnagar: రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ కరీంనగర్ రాజీవ్ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Sept 2026 7:45 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో రాజీవ్ చౌక్ వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం!

Karimnagar: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పోలీస్ స్టేషన్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ FIR నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు రాజీవ్ చౌక్ వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హల్ద్వానీలో AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిపై బీజేపీ–RSS శక్తులు చేసిన కులతత్వ చర్యను ఖండించినందుకే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఉత్తరాఖండ్‌లో FIR నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనమని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

అసలు ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై వెంటనే FIR నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ FIRను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, గుర్రం వాసు, తాళ్లపల్లి శ్రీకాంత్, అజయ్ గౌడ్,జక్కుల అఖిలేష్ సతీష్,గట్టు ప్రశాంత్, రమణ,అజయ్, కుమార్,అరవింద్,వెంకటేష్, జలంధర్,ఇమ్రాన్, ఇమ్రాన్ గాని అశోక్ రావు, గోల్కొండరాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story