Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు
Yellareddypeta: ఎల్లారెడ్డిపేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి డి. శ్రీనివాస్. పాల్గొన్న డ్రైవర్లు, విద్యార్థులు.
Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు
ఎల్లారెడ్డిపేట: రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి. శ్రీనివాస్ సూచించారు. జిల్లా కలెక్టర్, రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, పాఠశాల బస్సుల డ్రైవర్లు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. గొల్లపల్లి సహా మండలంలోని ప్రాంతాల నుంచి సుమారు 50 మంది ఆటో, పాఠశాల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా DTO డి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను, విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని డ్రైవర్లకు సూచించారు. పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, జీబ్రా క్రాసింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వినియోగించాలని అధికారులు అవగాహన కల్పించారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాల్లోని వాహనదారులకు కూడా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పృధ్విరాజ్ వర్మ, సీఐ ఓ. వెంకటేష్, జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు మనోరచారి, స్థానిక సర్పంచ్ ఎనగందుల నర్సింలు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు, ఆటో, బస్సు డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




