Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్
Yellareddypeta: సర్వాయిపల్లిలో భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.
Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్
ఎల్లారెడ్డిపేట: మండలం సర్వాయిపల్లి గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. భూ వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భూ భారతి కింద సర్వాయిపల్లి గ్రామంలో రోవర్ యంత్రాలతో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సర్వేయర్లకు పలు సూచనలు చేశారు.
గ్రామంలోని రెవెన్యూ, అటవీ భూముల రీ సర్వేకు సంబంధించిన వివరాలను అదనపు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియపై గ్రామంలోని రైతులకు ముందుగా సమాచారం అందించారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. నిబంధనల మేరకు రీ సర్వే నిర్వహించాలని అధికారులను, సర్వేయర్లను ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ వేణు, సర్వేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




