Yellareddypet: ఓం మౌజయః ఆశ్రమంలో వరల్డ్ రికార్డు – 1003 మందికి చీరల పంపిణీ
Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం ఓం మౌజయః ఆశ్రమం 13వ వార్షికోత్సవం. 1003 మంది సీనియర్ సిటిజన్ మహిళలకు చీరల పంపిణీతో వరల్డ్ రికార్డ్స్ ఇండియాలో చోటు.
Yellareddypet: ఓం మౌజయః ఆశ్రమంలో వరల్డ్ రికార్డు – 1003 మందికి చీరల పంపిణీ
ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులోని ఓం మౌజయః ఆశ్రమంలో శ్రావణ మాస ఏకాదశి సందర్భంగా వసుధైక కుటుంబ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమం 13వ వార్షికోత్సవం సందర్భంగా 50 సంవత్సరాలు పైబడిన 1003 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
1003 మంది సీనియర్ సిటిజన్ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో ఓం మౌజయః విశ్వ మహిళా సేవా సమితి పేరు వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్‌లో నమోదైంది. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో సహస్ర కుంకుమార్చన, సహస్ర కలశార్చన, సహస్ర దీపారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఉచిత అన్నదానంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ వేడుకలకు రెండు వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నిజామాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు శక్తిపీఠం మహామాత ర్యాలీ నిర్వహించగా.. సాయంత్రం శ్రీ ప్రభు పల్లకి సేవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఓం మౌజయః ఆశ్రమ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది.




