Peddapalli: పెద్ద కొమిరే అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్ద కొమిరే అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Peddapalli: పెద్ద కొమిరే అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్ద కొమిరే అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పోలోజు రమ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గోలి లింగారెడ్డి ఉపసర్పంచ్ మూల సంపత్ రెడ్డి కార్యదర్శి శ్రీకాంత్ హాజరై తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించి తల్లిపాల విశిష్టతను గర్భిణీలకు బాలింతలకు తల్లులకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోలి లింగారెడ్డి మాట్లాడుతూ... తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదపడతాయి అన్నారు పసిపిల్లలకు వచ్చే పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి తల్లిపాలు రక్షణ కవచంలా పనిచేస్తాయన్నారు.
కనీసం ఆరు నెలల పాటు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ విషయంలో గర్భిణులు, బాలింతలు సరైన అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పోలోజు రమతో పాటు గ్రామ తల్లులు, బాలింతలు, గర్భిణులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




