Sircilla: గీతానగర్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Aug 2026 1:47 PM IST
Sircilla
X

Sircilla: గీతానగర్ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు!

Sircilla: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ అంగన్‌వాడీ 17వ కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.

అంగన్‌వాడీ కార్యకర్త సైదాషఫీ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు తొలి టీకా వంటివని తెలిపారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి లభిస్తాయని వివరించారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు.

తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మేధో వికాసానికి కూడా తల్లిపాలు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story