Sircilla: ప్రగతినగర్-1 సెంటర్‌లో ఉత్సాహంగా అక్షరాభ్యాస కార్యక్రమం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రగతినగర్-1 అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Sircilla: ప్రగతినగర్-1 సెంటర్‌లో ఉత్సాహంగా అక్షరాభ్యాస కార్యక్రమం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రగతినగర్-1 అంగన్వాడీ సెంటర్‌లో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ స్వప్న ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు.
అంగన్వాడీ టీచర్ బి. పద్మలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారుల విద్యారంభాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
Next Story




