Gangadhara: గట్టుబూత్కూర్‌లో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 19 Jun 2026 2:00 PM IST
Gangadhara
X

Gangadhara: గట్టుబూత్కూర్‌లో ఎలుగుబంటి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు!

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలో ఎలుగుబంటి సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో పలు పశువులపై దాడి చేసిన ఈ ఎలుగుబంటి తాజాగా మరోసారి గ్రామంలో కనిపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.

గ్రామ పరిసర ప్రాంతాల నుంచి గ్రామ వీధుల్లోకి వచ్చిన ఎలుగుబంటిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు గ్రామస్థులు ఎలుగుబంటి సంచారాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం కుక్కలు గుంపుగా చేరి ఎలుగుబంటిని వెంబడించడంతో అది గ్రామం వెలుపలికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

గతంలో కూడా ఇదే ఎలుగుబంటి పలు పశువులపై దాడి చేసి చంపిన ఘటనలు చోటుచేసుకున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు.

ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి దానిని పట్టుకుని సమీప అడవిలోకి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపించిన వెంటనే అటవీ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story