Peddapalli: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే మా లక్ష్యం విప్ విజయ రమణారావు!
Peddapalli: పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యా రంగానికి రూ.50 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.
Peddapalli: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే మా లక్ష్యం విప్ విజయ రమణారావు!
Peddapalli: పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యా రంగానికి ₹50 కోట్లు కేటాయింపు ఉషణపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.32 లక్షలతో నిర్మించిన భవనం, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గంగారం, ఉషన్నపల్లి గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.ఉషన్నపల్లి గ్రామంలో ₹10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ₹32 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ... ఒకప్పుడు సరైన భవనం లేక, కేవలం 20 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల, నేడు ఉపాధ్యాయులు మరియు ప్రజాప్రతినిధుల కృషి వల్ల 56 మంది విద్యార్థులతో కళకళలాడుతుండటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెడ్మాస్టర్ సమ్మయ్య,MEO మరియు గ్రామ సర్పంచ్ చొరవతో 'సోలార్ విద్యుత్ ప్లాంట్' ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ వాడకం పోను మిగిలిన డబ్బులు నేరుగా పాఠశాల ఖాతాలోనే జమవుతాయని తెలిపారు.
రూ.50 కోట్లతో విద్యా రంగానికి మహర్దశ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నియోజకవర్గంలో విద్యా రంగానికి ఇప్పటివరకు ₹50 కోట్ల పైచిలుకు ఖర్చు చేశామని తెలిపారు. మండలంలో గత 10 ఏళ్లలో స్కూల్ భవనాలకు కోటి రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం రెండేళ్లన్నర కాలంలోనే కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్కూల్ భవనాలు, కాంపౌండ్ వాల్స్ కోసం ₹5 నుండి ₹6 కోట్లు, కస్తూరిబా పాఠశాల (KGBV) విస్తరణకు ₹2.5 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అలాగే ముఖ్యమంత్రి ఆశయం మేరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం (టిఫిన్) అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
త్వరలోనే నూతన రోడ్ల నిర్మాణం:
గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్డు నుండి ఉషన్నపల్లి గ్రామం నుంచి పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే శ్రీరాంపూర్ R&B రోడ్డు నుండి ఉషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేసి పనులు పూర్తి చేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా అర్హతలు కలిగిన మెరిట్ ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీవో సురేందర్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు,ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




