Vemulawada: ఘనంగా ఆషాఢ బోనాలు: పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

Vemulawada: శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఎంప్లాయిస్ యూనియన్, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని పూజలు చేశారు.

BABU, VEMULAWADA
Published on: 5 Aug 2026 4:01 PM IST
Vemulawada
X

Vemulawada: ఘనంగా ఆషాఢ బోనాలు: పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

వేములవాడ: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఎంప్లాయిస్ యూనియన్, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలు సమాజంలో ఐక్యతను,ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA

Next Story