Sircilla: వేములవాడ, చొప్పదండి ప్రజలకు అలర్ట్: తాగునీటి సరఫరా బంద్!
Sircilla: అగ్రహారం శుద్ధి కేంద్రంలో పనుల వల్ల సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండిలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు ప్రత్యామ్నాయాలు చేసుకోవాలని సూచించారు.
Sircilla: వేములవాడ, చొప్పదండి ప్రజలకు అలర్ట్: తాగునీటి సరఫరా బంద్!
సిరిసిల్ల: వేములవాడ, చొప్పదండి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం అగ్రహారం గ్రామంలోని 120 ఎంఎల్డీ (MLD) మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో సాధారణ నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది.
మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల కార్యనిర్వాహక ఇంజనీర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆగస్టు 8 శనివారం ఉదయం 8.00 గంటల నుంచి ఆగస్టు 9 ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటల వరకు నీటి శుద్ధి ప్లాంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అగ్రహారంలోని 120 ఎంఎల్డీ ప్లాంట్ నుంచి సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి ప్రాంతాలకు బల్క్ తాగునీటి సరఫరా జరుగుతోంది.
దీంతో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిపోనుంది.
నిర్వహణ పనులు పూర్తయిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి తాగునీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ముందస్తుగా అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు విజ్ఞప్తి చేశారు.




