Karimnagar: ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు.. జమ్మికుంటలో ప్రజాపాలన వార్డు సభలు
Karimnagar: జమ్మికుంట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ జరిగింది.
Karimnagar: ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు.. జమ్మికుంటలో ప్రజాపాలన వార్డు సభలు
Karimnagar: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక అర్థిదారుల సంఘం వద్ద ఏర్పాటు చేసిన 23,24,12వ వార్డుసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అధ్యక్షతన మొదటగా ముఖ్యమంత్రి సందేశం తదుపరి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ అనే గీతం ఆలపించి ప్రభుత్వ పథకములు మరియు ఇతర అంశములు:
1) ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం.
2) గృహజ్యోతి.
3) చేయుత పెన్షన్స్.
4) మహాలక్ష్మీ పథకములో భాగంగా గ్యాస్ సిలెండర్ సబ్సీడి
5) తడి - పాడి చెత్త వేరు చేయడం, పరిసరాల పరి శుభ్రత మరియు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం
6) ఇంటి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్స్ సకాలములో చెల్లించడం.
7) మంచినీటిని వృదా చేయకుండా చూడడం
8) వన మహోత్సవము పాటు ఇతర అంశాలపై చర్చించడం జరిగింది ఇట్టి సభలో కౌన్సిలర్స్ మొలుగు ప్రణీత, చుంచు రమాదేవి మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ వార్డు ఆఫీసర్స్ మెప్మ CLRP, RP వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




