Yellareddypet: ఎల్లారెడ్డిపేట పంచాయతీలో ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్.!
Yellareddypet: ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల సౌకర్యం కోసం సర్ (SIR) పత్రాల పూరింపునకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
Yellareddypet: ఎల్లారెడ్డిపేట పంచాయతీలో ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్.!
ఎల్లారెడ్డిపేట: ఓటర్ల సౌకర్యం కోసం సర్ (ఎస్‌ఐఆర్) పత్రాల పూరింపునకు ఇద్దరు వాలంటీర్లను నియమించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని పత్రాల పూరింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందాలని ఆయన కోరారు. వాలంటీర్లకు అవసరమైన వేతనాలను గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన మండల తహసీల్దార్ సుజాత, ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకున్న ఈ చర్యను అభినందించారు. సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను ఆమె ప్రశంసించారు.
Next Story




