Karimnagar: సాగునీటి కష్టాలు తీర్చే దిశగా.. వొడితల ప్రణవ్ చొరవ
Karimnagar: కల్వల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని, తనుగుల చెక్ డ్యాం పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన వొడితల ప్రణవ్. మంత్రి సానుకూల స్పందన.
Karimnagar: సాగునీటి కష్టాలు తీర్చే దిశగా.. వొడితల ప్రణవ్ చొరవ
కరీంనగర్ జిల్లా: వీణవంక, మండలం జమ్మికుంట మండలాల్లోనీ రైతుల సాగు నీరు అందించే కల్వల ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలోని వారి ఛాంబర్ లో కలిసి విన్నవించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ .ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే. గుంపుల-శంభునిపల్లి గ్రామాల పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా త్వరితగతిన పునరుద్ధరణ చేయాలని కోరారు.రైతులకు సాగు నీటి విషయంలో ఇబ్బందులు కలగకుండా చాలా ఉపయోగపడతాయని తెలిపారు.సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పనులు మొదలు పెడతామని తెలిపారు. అన్నారు.
Next Story




