Vemulawada: వేములవాడ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రారంభం

Vemulawada: వేములవాడ ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే హెచ్-143 సభ్యత్వ నమోదు కార్యక్రమం. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యమని పేర్కొన్న సంఘం నేతలు.

KALEEM, SIRICILLA
Published on: 15 July 2026 6:46 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రారంభం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రధాన లక్ష్యమని లాయక్ పాషా పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జర్నలిస్టు సభ్యత్వం తీసుకుని సంఘటిత శక్తిని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయించామని తెలిపారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం వద్ద బలంగా వాదించి సాధించే దిశగా సంఘం కృషి చేస్తుందని చెప్పారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story