Vemulawada: వేములవాడలో ఉద్రిక్తత: భర్తపై కత్తులతో దాడి

Vemulawada: వేములవాడ అర్బన్ కాలనీలో ఆస్తి వివాదంతో శంకర్‌పై మొదటి భార్య, బంధువులు కత్తులతో దాడి చేశారు.

BABU, VEMULAWADA
Published on: 8 Aug 2026 11:21 AM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో ఉద్రిక్తత: భర్తపై కత్తులతో దాడి

వేములవాడ: వేములవాడలో భర్తపై కత్తులతో దాడి.. అర్బన్ కాలనీలో ఉద్రిక్తత

వేములవాడ అర్బన్ కాలనీలో కుటుంబ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది.

వావిలాల శంకర్‌పై కత్తులతో దాడి జరిగినట్లు సమాచారం. మొదటి భార్య ఎల్లవ్వ తో పాటు బంధువులుగా చెప్పబడుతున్న ఎల్లయ్య, మల్లయ్య, మురళితో పాటు ఎల్లవ్వ పెద్ద కుమార్తె మౌనిక కూడా దాడి ఘటనలో ఉన్నట్లు శంకర్ ఆరోపిస్తున్నాడు.

శంకర్ రెండో భార్య అంజలి ఇంటిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.

తన మొదటి భార్యతో గతంలో ఒప్పందం కుదుర్చుకుని రెండో వివాహం చేసుకున్నానని శంకర్ తెలిపాడు. అప్పట్లో ఆస్తి పంపకాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ, మళ్లీ ఆస్తి ఇవ్వాలంటూ తనపై దాడి చేసినట్లు ఆరోపించాడు.

ఇదే విషయంపై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇరు వర్గాల మధ్య సమస్యను సద్దుమణిగేలా చేసినట్లు శంకర్ తెలిపాడు.

అయితే తాజాగా అదే కుటుంబానికి చెందిన వారు, మొదటి భార్య బంధువులు, పెద్ద కుమార్తెతో కలిసి తనపై మరోసారి దాడికి పాల్పడ్డారని శంకర్ ఆరోపించాడు.

గతంలో పోలీసుల వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదా? మళ్లీ దాడి జరగడానికి అసలు కారణం ఏంటి?

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA

Next Story