Vemulawada: వేములవాడలో కాంగ్రెస్ ధర్నా: రాహుల్‌కు మద్దతుగా నిరసన!

Vemulawada:వేములవాడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ ధర్నా. తూమ్ మధు, పుల్కం రాజు పాల్గొని రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు.

BABU, VEMULAWADA
Published on: 23 July 2026 2:02 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో కాంగ్రెస్ ధర్నా: రాహుల్‌కు మద్దతుగా నిరసన!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ

రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వేములవాడ లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమ్ మధు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా వేములవాడ తిప్పాపురం రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమ్ మధు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర సంఘటన అని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

"రాహుల్ గాంధీ గారిపై జరిగిన దాడి ఒక్క వ్యక్తిపై జరిగిన దాడి కాదు... రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి" అని వారు అన్నారు.

నెహ్రూ–గాంధీ కుటుంబం దేశ స్వాతంత్ర్యం నుంచి భారతదేశ అభివృద్ధి వరకు ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన పేర్కొన్నారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారని, శ్రీమతి ఇందిరా గాంధీ దేశ సమగ్రత కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, శ్రీ రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారని, శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో బలోపేతం చేశారని అన్నారు.

అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ రాహుల్ గాంధీ రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు.

ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుడిని భయపెట్టాలని, ఆయన గొంతును అణిచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం, దాడులు మరియు కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడటం దేశానికి మంచిది కాదన్నారు.

"దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ప్రజాదరణ, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అపారమైన ఆదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోంది. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అణచలేరు, సత్యాన్ని ఎవరూ దాచలేరు" అని వారుఅన్నారు.

రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని మరియు రేవంత్ గారిని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అని అన్నారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి వేములవాడ ప్రజల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA

Next Story