Vemulawada: వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి కలెక్టర్

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

KALEEM, SIRICILLA
Published on: 7 Aug 2026 7:33 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి కలెక్టర్

వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పనికి స్పష్టమైన గడువు విధించి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.

శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వీటీఏడీఏ పనులపై దేవాదాయ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, ఎన్పీడీసీఎల్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో సమన్వయం పెంచడంతో పాటు కార్మికుల సంఖ్యను కూడా పెంచి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

నూతన గోశాల, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు, టాయిలెట్ల నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 అడుగుల రహదారి విస్తరణ, ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్ టవర్ల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే జిల్లా వైద్య కళాశాల, బాలుర-బాలికల హాస్టళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని, సిరిసిల్ల కోర్టు సముదాయ పనులను కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story