Vemulawada: చీర్లవంచలో హైపర్‌టెన్షన్‌పై అవగాహన సదస్సు

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 5:01 PM IST
Vemulawada
X

Vemulawada: చీర్లవంచలో హైపర్‌టెన్షన్‌పై అవగాహన సదస్సు

వేములవాడ: వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్లొమా ఇన్ హెల్త్ ప్రమోషన్ అండ్ ఎడ్యుకేషన్ శిక్షణార్థి శ్రీమతి సరోజన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

గ్రామ సర్పంచ్ శ్రీమతి కిరణ్మయి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధిక రక్తపోటు నిశ్శబ్దంగా శరీరాన్ని దెబ్బతీసే వ్యాధి అని, 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

సమతుల్య ఆహారం తీసుకోవడం, ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చని తెలిపారు.

శిక్షణార్థి శ్రీమతి సరోజన రక్తపోటు లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు, చికిత్స, జీవనశైలిలో పాటించాల్సిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ శేఖర్, గ్రామ కార్యదర్శి నీరజ, సూపర్‌వైజర్ కవిత, డీడీఎం కార్తీక్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story