Jammikunta: వాత్సల్య హాస్పిటల్‌ను ప్రారంభించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన వాత్సల్య పిల్లల హాస్పిటల్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
Jammikunta: వాత్సల్య హాస్పిటల్‌ను ప్రారంభించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణ పరిధిలో బొమ్మల గుడి శివాలయం ఎదురుగా డాక్టర్ దేవేందర్ రెడ్డి వాత్సల్య పిల్లల హాస్పిటల్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంతా వాసులకు చిన్న పిల్లలు అనారోగ్యం చెందిన వారు జిల్లా స్థాయి హాస్పిటల్ కు వెళ్లకుండా మన జమ్మికుంటలోనే అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి రావడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ , డాక్టర్లు సత్యం సావిత్రి. ఇంద్రసేనారెడ్డి. మెడికల్ షాప్ల ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు. పలువురు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.




