Peddapalli: లక్ష్మీపూర్‌లో ‘వన మహోత్సవం’.. 300 పండ్ల మొక్కలు పంపిణీ!

Peddapalli: లక్ష్మీపూర్‌లో సర్పంచ్ మేకల లావణ్య ఆధ్వర్యంలో ‘వన మహోత్సవం’. పచ్చదనం కోసం సొంత ఖర్చులతో 300 పండ్ల మొక్కలు నాటించిన సర్పంచ్.

KONDAL, SULTANABAD
Published on: 31 July 2026 1:33 PM IST
Peddapalli
X

Peddapalli: లక్ష్మీపూర్‌లో ‘వన మహోత్సవం’.. 300 పండ్ల మొక్కలు పంపిణీ! 

లక్ష్మీపూర్ లో ఘనంగా ‘వన మహోత్సవం’

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో ‘వన మహోత్సవ’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి, మరియు పాలకవర్గం తో పాటు గ్రామస్తుల సహకారంతో సొంత ఖర్చులతో సుమారు 30 వేల విలువగల 300 పండ్ల మొక్కలను కొనుగోలు చేసి గ్రామంలో నాటారు.​ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. మొక్కలు రక్షించేందుకు టీ గడ్ల కోసం గ్రామానికి చెందిన గణపతి రెడ్డి 3000 రూపాయలు సహాయం అందజేశారు.

​ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. గ్రామాభివృద్ధికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. లక్ష్మీపూర్ సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి మరియు పాలకవర్గం సొంత ఖర్చులతో ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. పలువురు సర్పంచులు లక్ష్మీపూర్ గ్రామం పాలకవర్గం ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో అదేవిధంగా మొక్కలు నాటాలన్నారు.​ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జింగిలి తిరుపతి, శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ మాజీ సర్పంచ్లు మాదాసి సతీష్, శంకర్ వార్డు సభ్యులు పచ్చిక రజిత మల్లేష్, బోయిన చందర్, బోయిన పుల ఐలయ్య, బొమ్మిరెడ్డి చంద్రకళ సదయ్య, కొన్ని అశోక్ సుజాత స్వామి , నాయకులు నరసింహారెడ్డి వీరేశం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story