Karimnagar: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. USFI విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్

Karimnagar: ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ కార్యాలయ ముట్టడికి యత్నించిన యుఎస్ఎఫ్ఐ (USFI) నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 24 July 2026 12:00 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఉద్రిక్తత.. USFI విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్

యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్..

కరీంనగర్: ఢిల్లీలో విద్యార్థులు యువతపై జరిగిన దాడిలను ఖండిస్తూ యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నేడు బండి సంజయ్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నాయకులు. కోర్టు ముందు నుండి బండి సంజయ్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన వారిని పోలీసులు కరెంట్ ఆఫీస్ ముందు వారించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఘ నాయకులు మాట్లాడుతూ అన్యాయం జరుగుతుందని నిరసన తెలిపితే అసాంఘిక కార్యకర్తలతో కలిసి విద్యార్థులపై అమానుషంగా దాడులు చేసి భయ బ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి న్యాయం చేయమని అడిగిన వాళ్లను అరెస్టు చేసి దాడులు చేయడం సమంజసం కాదని న్యాయం జరిగేంత వరకు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏకమై నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసుల అంచనాలు తప్పించి నిరసన..

ఢిల్లీలో జరిగిన ఘటనకు నిరసనగా ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ముందే తెలిపిన యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు. కోర్టు చౌరస్తా నుండి కార్యాలయం వాళ్లకు ర్యాలీ నిర్వహిస్తామని ముందుగా చెప్పిన నాయకులు అదేవిధంగా ఫ్లెక్సీలు, ప్లాకార్ట్స్ పట్టుకొని నిరసన నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ కార్యాలయ ముట్టడి, విద్యాసంస్థల బంద్ పిలుపుతో నగరంలో భారీగా మోహరించిన పోలీసు బలగాల అంచనాలను తలకిందులు చేసి నిరసన వ్యక్తం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను ముందుగానే అరెస్టు చేసిన పోలీసులు వీరి ఆగస్టులో ఆలస్యం కావడంతో వాళ్లు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అడుగడుగునా పోలీసు నిగా ఉన్నా కూడా ఒక్కసారిగా 20 మంది వరకు ర్యాలీగా బయలుదేరిన పోలీసులు గుర్తించలేకపోయారు. అప్రమత్తంగా లేకపోతే రసవత్తరంగా మారేది, ఏది ఏమైనా పోలీసులు కరెంట్ ఆఫీస్ వద్ద అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story