Karimnagar: కరీంనగర్ డిఫెన్స్ అకాడమీలపై విచారణ జరపాలి – USFI

Karimnagar: కరీంనగర్ జిల్లాలో అనుమతి లేని డిఫెన్స్ అకాడమీలపై చర్యలు తీసుకోవాలని డిఈఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన యూఎస్ఎఫ్ఐ (USFI) నాయకులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 Aug 2026 5:53 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ డిఫెన్స్ అకాడమీలపై విచారణ జరపాలి – USFI

కరీంనగర్: భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ అకాడమీ లపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని DEO కార్యాలయంలోని సూపర్డెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ అకాడమీలు కొన్ని అనుమతి లేకుండా మరికొన్ని ఒకే క్యాంపస్ అనుమతి తీసుకొని అనేక అకాడమీలు నడుపుతున్నారని వీటి పై విద్యాధికారులు ఎందుకు విచారణ జరపడం లేదని వారిని ప్రశ్నించారు.

ఒకపక్క అకాడమీలు అని చెబుతూ మరియు ఇంటర్ తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని వారిని ప్రశ్నించారు మరియు వాటి పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని మరియు యూనిఫామ్ గ్రౌండ్ అదనపు ఫీజులు ఇష్టానుసారంగా అసలు చేస్తున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం సిగ్గుచేటునారు.

ఇప్పటికైనా జిల్లా విద్యాధికారులు స్పందించి డిఫెన్స్ అకాడమీ లపై విచార జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా యజమాన్యాలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు విద్యాధికారులు స్పందించకుంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు మరి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story