Sultanabad: సుల్తానాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు
Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Sultanabad: సుల్తానాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు
Sultanabad: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, కౌన్సిలర్ కందునూరి సమతా కుమార్ లు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రోగులకు పండ్ల పంపిణీ:
జన్మదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, జ్యూస్‌లను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవలో మరిన్ని ఏళ్లు సాగాలి:
మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, నిరంతర ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటూ, మరెన్నో ఏళ్లపాటు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో మండల ప్రధానకార్యదర్శులు కొల్లూరి సంతోష్ కుమార్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, నాయకులు మెండే శంకరయ్య, మల్కా భాగ్యలక్ష్మి, గుడ్ల వెంకటేష్, బండారి లత, ఉషణ అన్వేష్, ఎరవెల్లి అనిల్ రావు, వడ్లకొండ శశివర్ధన్ గౌడ్, వలస సాయికిరణ్, దాసరి వెంకటేష్, నల్లవెల్లి శంకర్, వీరగోని కిరణ్ గౌడ్, దాసరి పూర్ణచందర్, బాలకృష్ణ, ఆకుల లక్ష్మణ్, ఈర్ల ప్రశాంత్, పోచంపల్లి ఈశ్వర్, కట్టాగోని సాయి, కరెంగుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.




