Karimnagar: కరీంనగర్‌లో ప్రతిభావంతులకు సైకిళ్లు.. మంత్రి బండి సంజయ్ కార్యక్రమం
Karimnagar: కరీంనగర్ బూరుగుపల్లిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి బండి సంజయ్ కార్యక్రమం విద్యార్థులకు ప్రోత్సాహంగా నిలిచింది.
Karimnagar
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాలలో 6వ, 7వ, 8వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాప్‌లో నిలిచిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి, గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన సర్పంచ్, విద్య ద్వారానే భవిష్యత్తు उज్వలమవుతుందని, మరింత కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రి చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.




