Sultanabad: సుల్తానాబాద్ బాల సదన్ నుంచి ఇద్దరు బాలికలు పరారీ – కలకలం!

Sultanabad: పెద్దపల్లి జిల్లా బాల సదన్ హోమ్ నుంచి కాంపౌండ్ వాల్ దూకి ఇద్దరు బాలికలు పరారయ్యారు. సూపరింటెండెంట్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

KONDAL, SULTANABAD
Published on: 29 July 2026 1:45 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్ బాల సదన్ నుంచి ఇద్దరు బాలికలు పరారీ – కలకలం!

పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్‌లోని బాల సదన్ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పరారీ కావడం తీవ్ర కలకలం రేపింది. మార్కండేయ కాలనీలో ఉన్న బాల సదన్ కాంపౌండ్ వాల్ పక్కన కుర్చీలు వేసుకుని, గోడ దూకి తెల్లవారుజామున ఇద్దరు బాలికలు వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు.

​కనిపించకుండా పోయిన వారిలో పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి (15) 9వ తరగతి ఓదెల మండలం ఉప్పరిపల్లెకు చెందిన ఆకృతి (8) 4వ తరగతిఉన్నారు. ఇందులో ఉమామహేశ్వరి కేవలం మూడు రోజుల క్రితమే ఈ బాల సదన్‌కు వచ్చినట్లు సమాచారం.​రాత్రి వేళ బాలికలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన హాస్టల్ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. హాస్టల్ సూపరింటెండెంట్ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story