Sircilla: జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి: లాయక్ పాషా!

Sircilla: జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నిరంతరం పోరాడుతుందని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Aug 2026 10:51 PM IST
Sircilla
X

Sircilla: జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి: లాయక్ పాషా!

సిరిసిల్ల: జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, స్వేచ్ఛ పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజే హెచ్-143 నిరంతరం పోరాడుతుందని జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో అల్లం నారాయణ, మారుతి సాగర్‌ల సారథ్యంలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు కల్పించాలని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులను వెంటనే అందించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం, పెన్షన్ అందించే కార్యక్రమంలో సంఘం ముందుండి పనిచేస్తుందని లాయక్ పాషా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ టీయూడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షుడిగా పరకాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

యూనియన్ బలోపేతంతో పాటు సభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ఐక్యంగా పరిష్కరించేందుకు ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు, కోశాధికారి సయ్యద్ కలీమ్, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సల్మాన్, మల్లికార్జున్, దారం కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కంటాల విజయ్, మాజీ పట్టణ అధ్యక్షుడు రామనాధం, సీనియర్ పాత్రికేయులు చిలుక సత్యనారాయణ, నాగరాజు, బి. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, భాస్కర్, రఫీ, అస్లంతో పాటు జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story