Sircilla: 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలం!

Sircilla: ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా విమర్శించారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Sept 2026 3:13 PM IST
Sircilla
X

Sircilla: 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలం!

Sircilla: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా విమర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాలన పట్ల నిరసన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తోందని తుల ఉమా విమర్శించారు. హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, కౌన్సిలర్లు దార్ణం అరుణ లక్ష్మీనారాయణ, బోల్గం వైష్ణవి నాగరాజు, కూర భాగ్యలక్ష్మి దేవరాజు, గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, ఆడిచర్ల రూప సాయి కృష్ణ, గెంట్యాల శ్యామల శ్రీనివాస్, మంచె రేణుక శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ మహిళా నాయకులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story