Karimnagar: కోర్టు చౌరస్తాలో ఘనంగా 'ఏకలవ్య జయంతి ఉత్సవాలు!

Karimnagar: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆదివాసీల హక్కులపై ప్రసంగించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 July 2026 7:45 PM IST
Karimnagar
X

Karimnagar: కోర్టు చౌరస్తాలో ఘనంగా 'ఏకలవ్య జయంతి ఉత్సవాలు!

కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదివాసి విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్ట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అదివాసి ఎరుకల జాతిలో నిషాద్ తెగలో జన్మించి అదే తెగకు నాయకత్వం వహించిన గొప్ప రాజు ఏకలవ్యుడు విలువిద్యలో మంచి నైపుణ్యం పొందాడు. మహాభారత చరిత్ర ఏకలవ్యుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏకలవ్యుడు స్వాభిమానం, సంకల్పం, గురుభక్తికి ప్రతీకగా నిలిచాడు. తన స్వయంకృషితో ఆత్మవిశ్వాసంతో విలువిద్యలో అపూర్వ నైపుణ్యాన్ని సాధించి నేటి యువతకు కూడ ఆదర్శంగా నిలిచాడు. ఏకలవ్యుడి జీవితం సమాజంలో సమాన అవకాశాలు అందరికీ రావాలని తను కృషి చేశాడు.

ప్రతిభకు కులం, వర్గం, ఆర్థిక స్థితి అడ్డంకులు కాకూడదనే సందేశాన్ని ఆయన జీవితచరిత్ర చెబుతోందని వారు అన్నారు. కష్టపడి సాధించాలనే సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఆయన జీవితం నిరూపించింది.

ప్రస్తుత సమాజంలో యువత ఏకలవ్యుడి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనను ఆదర్శంగా తీసుకొని విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. అలాగే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు కూడ కృషి చేయాలి. ఏకలవ్యుడి స్ఫూర్తితో ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా, ప్రజల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ కృషి చేస్తుందని అన్నారు.

అదేవిధంగా గురుశిష్యుల బందాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప శిష్యుడు అని అన్నారు. అదివాసులు ఎరుకల కులస్తులు ఇప్పటికీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తెగలకు కచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు అండగా ఉంటుందని వారు అన్నారు. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయితే తెలంగాణలోని ఆదివాసి ఎరుకల కులస్తులకు పెద్ద పీఠం వేస్తుందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, ఆదివాసి విభాగం మహిళా నాయకురాలు కుతాడి రజిత, శివసారం రాజ్ కుమార్, ఎస్సీ విభాగం సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్, మడిపల్లి వినిత్, మ్యాక వినోద్, మహిళా విభాగం జిల్లా సీనియర్ నాయకురాలు జంగా అపర్ణ సాగర్, దాసరి శైలజ, పల్లె శారద, లింగంపల్లి శ్రీనివాస్, ఎండి రజి, నగునూరి రమేష్, సమీరా, కౌశిక్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story