Jagtial: అర్ధరాత్రి రోడ్డుపై విరిగిన చెట్టు.. వెంటనే రంగంలోకి దిగిన యువకులు!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద అర్ధరాత్రి రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం.
Jagtial: అర్ధరాత్రి రోడ్డుపై విరిగిన చెట్టు.. వెంటనే రంగంలోకి దిగిన యువకులు!
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం పూడూరు (అరపల్లె) గ్రామ శివారులో అర్ధరాత్రి ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్టు అడ్డంగా పడిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే యువ నాయకులు అనుమాండ్ల అజయ్ రెడ్డి, వార్డు సభ్యుడు కుంట రమేష్, కవ్వం మధు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వెంటనే జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి, దాని సహాయంతో రహదారిపై పడిన భారీ వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.
కొద్ది గంటల పాటు శ్రమించి చెట్టును పూర్తిగా తొలగించడంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అలాగే అక్కడ ఉన్న వాహనదారులకు అవసరమైన సహాయక చర్యలు అందించి, రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అర్ధరాత్రి సమయంలోనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు తొలగించిన యువ నాయకుల సేవలను గ్రామస్తులు, వాహనదారులు అభినందించారు.




