Singareni: సింగరేణి సమస్యలపై డిప్యూటీ సీఎం, మంత్రితో కార్మిక సంఘాల భేటీ!

Singareni: సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 24 Aug 2026 10:17 PM IST
Singareni
X

Singareni: సింగరేణి సమస్యలపై డిప్యూటీ సీఎం, మంత్రితో కార్మిక సంఘాల భేటీ!

సింగరేణి: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు.

అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story