Manthani: తొలి ఏకాదశి వేడుకలు గోదావరి వద్ద భక్తుల పుణ్యస్నానాలు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి ఆధ్యాత్మిక శోభ. గోదావరిలో పుణ్యస్నానాలు, గౌతమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ఆచరించిన భక్తులు.

SHANKAR, MANTHANI
Published on: 25 July 2026 11:10 AM IST
Manthani
X

Manthani: తొలి ఏకాదశి వేడుకలు గోదావరి వద్ద భక్తుల పుణ్యస్నానాలు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరించిన అనంతరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.

పుణ్యస్నానాలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ గౌతమేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంథని పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, గోదావరి నది ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో మంథని పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహందర్ రెడ్డి, కౌన్సిలర్లు గోదావరి నదిని సందడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షించారు.

భక్తులకు ఎలాంటి ఆటంకాలు, అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story