Sircilla: సిరిసిల్ల టీజీఎస్ ఆర్టీసీ డిపో టీఎంయూ నూతన కమిటీ ఎన్నిక!

Sircilla: టీజీఎస్ ఆర్టీసీ సిరిసిల్ల డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Aug 2026 10:35 PM IST
Sircilla
X

: సిరిసిల్ల టీజీఎస్ ఆర్టీసీ డిపో టీఎంయూ నూతన కమిటీ ఎన్నిక!

సిరిసిల్ల: సిరిసిల్లలోని టీజీఎస్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నూతన డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా ఎల్.ఆర్. రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. శ్రీనివాస్, గ్యారేజ్ కార్యదర్శిగా బి. సంతోష్, మహిళా కార్యదర్శిగా వి. కవిత, డిపో చైర్మన్‌గా ఎం. శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా జి. ప్రకాష్ ఎన్నికయ్యారు.

అలాగే సహ కార్యదర్శులుగా బి. బాలరాజు, డి. శ్రీనివాస్, టి. ప్రవీణ్, బి. కేపతి, మురళీధర్‌లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం సభ్యులు గౌరవ డిపో మేనేజర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి, ఎంపీ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీపీ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవీఆర్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story