Sircilla: విద్యుత్ వినియోగదారులకు ఏఐ వాట్సాప్ చాట్‌బాట్ సేవలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ వినియోగదారుల కోసం ఏఐతో కూడిన వాట్సాప్ చాట్‌బాట్ సేవలు ప్రారంభం. 24/7 అందుబాటులో ఉండే నంబర్ 8712481489.
Sircilla: విద్యుత్ వినియోగదారులకు ఏఐ వాట్సాప్ చాట్‌బాట్ సేవలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ వాట్సాప్ చాట్‌బాట్‌కు ఏఐను అనుసంధానం చేసింది. ఈ సేవలు 24 గంటలు, 7 రోజులు అందుబాటులో ఉంటాయని రాజన్న సిరిసిల్ల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) టి. వేణుమాధవ్ తెలిపారు.
విద్యుత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఇంటి నుంచే విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, బిల్లింగ్, కొత్త విద్యుత్ సర్వీసు కనెక్షన్, సోలార్ సేవలు తదితర సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు.
ఏఐ వాట్సాప్ చాట్‌బాట్ నంబర్: 87124 81489
వినియోగదారులు ఈ నంబర్‌ను తమ మొబైల్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా వివిధ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1912, ఏఐ వాట్సాప్ చాట్‌బాట్, మొబైల్ యాప్, వెబ్‌సైట్ వంటి డిజిటల్ సేవలను సంస్థ మరింత బలోపేతం చేసిందన్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు వాటి పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు టీజీ ఎన్పీడీసీఎల్ అందిస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టి. వేణుమాధవ్ సూచించారు.




